పవన్‌కు ఆ అర్హత లేదు: గంటా

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి గంటా శ్రీనివాసరావు.. ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత, అనుభవం జనసేన అధినేత పవన్‌కు లేదని అన్నారు. చంద్రబాబుకు ఉన్న అనుభవం ముందు చాలా చిన్నవాడని చెప్పారు. తుని సభలో ముఖ్యమంత్రి గురించి పవన్ చేసిన విమర్శలపై మంత్రి గంటా స్పందించారు. రాజకీయాల్లో ఎప్పుడేం చేయాలో .. చంద్రబాబుకు చెప్పేస్థాయి ఎవరికీ లేదన్నారు. రాష్ట్రానికి మేలు జరిగేలా సీఎం నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు.