గంటన్నరకు పదిలక్షలు!

మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా ద్వారా మరోసారి వెండితెరకు ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
ఆ సినిమా రిలీజ్ కు ముందుగానే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రాంతో బుల్లితెరపై సందడి
చేయనున్నారు. ఇప్పటివరకు నాగార్జున హోస్ట్ చేసిన ఈ షోకు ఇప్పుడు చిరంజీవిను
ఎన్నుకోవడం పట్ల అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు షో కోసం
చిరంజీవి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే విషయం మీడియా వర్గాలలో చర్చనీయాంశం
అయింది. గంటన్నర పాటు ప్రసారమయ్యే ఈ షో కోసం చిరంజీవికి పదిలక్షల రూపాయలను
పారితోషికంగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ రేంజ్ కు పది లక్షలేంటి..? అంతకన్నా
ఎక్కువ ఇవ్వొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన
షూటింగ్ జరుగుతోంది. డిసంబర్ నెల నుండి ఈ షో ను ప్రదర్శించనున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates