Homeతెలుగు Newsతెలంగాణలో ఇంటింటికి పైపుల ద్వారా గ్యాస్

తెలంగాణలో ఇంటింటికి పైపుల ద్వారా గ్యాస్

ప్రఖ్యాత ఇంజనీరింగ్ సంస్థ మేఘా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. టెక్నాలజీ రంగంలో అద్వితీయమైన ప్రతిభ కనబరుస్తున్న మేఘా సంస్థ ఇప్పుడు కొత్త రంగంలోకి అడుగిడింది. పటిష్టమైన ప్రణాళికతో ఎలాంటి వ్యయ ప్రయాసాలు లేకుండా నేరుగా పైపుల ద్వారా గృహ, వాణిజ్య అవసరాలకు మేఘా గ్యాస్ ను సరఫరా చేస్తోంది.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికి నేరుగా గ్యాస్ ను సరఫరా చేయడంతో పాటు వాహన అవసరాలకు ఇంధనాన్ని అందించేందుకు మేఘా నడుం బిగించింది.. మేఘా టెక్నాలజీతో సమయం ఆదాతో పాటు వినియోగదారులకు సులభంగా, సురక్షితంగా గ్యాస్ అందిస్తోంది. ఒక వైపు ఆకాశాన్నంటిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. మరో వైపు పరుగులు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లతో పేద, మధ్యతరగతి గృహ వినియోగదారులు భారం మోయలేకపోతున్నారు. ఆ భారాన్ని తగ్గించి వారికి ఊరటనివ్వడానికి మేఘా ఇంజనీరింగ్ సంస్థ కృషి చేస్తోంది. పక్కా ప్రణాళికతో శరవేగంగా సీజీడీ, సీఎన్జీ గ్యాస్ స్టేషన్లను నిర్మించి మధ్యతరగతి ప్రజలకు భారం తగ్గిస్తోంది.

megha gas 1

ఎల్పీజీ సిలిండర్ ధరలతో పోలిస్తే 40 శాతం తక్కువ రేటుకు మేఘా గ్యాస్ ను ఎంఈఐఎల్ అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో ఇప్పటికే గ్యాస్ ను సరఫరా చేస్తున్న ఎంఈఐఎల్ సంస్థ ఇప్పుడు తెలంగాణాలో తన సేవలను విస్తరిస్తోంది. అందులో భాగంగా నల్గొండ జిల్లాలో సేవలను ఇటీవలనే ప్రారంభించింది.

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ ఇంటికి వాణిజ్యపరంగా వంటగ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశ్యంతో తీసుకువచ్చిన సీజీడీ (City Gas Distribution) ప్రాజెక్ట్ లో భాగంగా మేఘా ఇంజనీరింగ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక ప్రాంతాల్లో పనులను పూర్తి చేసి మేఘా గ్యాస్ కింద గ్యాస్ సరఫరా సేవలను చౌకధరలకు అందిస్తోంది. 5000 కోట్లతో ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 11 లక్షల గృహాలకు గ్యాస్ సరఫరా కనెక్షన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ సిజిడి వ్యవస్థ ద్వారా దాదాపు 4 వేల మంది ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఉపాధి పొందనున్నారు.

నల్గొండ జిల్లాలో తొలిసారిగా గ్యాస్ పైప్ లైన్, సిటీ గేట్ స్టేషన్, పనులను గడువులోగా పూర్తి చేసి నల్గొండ ప్రజలకు ‘మేఘా గ్యాస్’ కింద చౌక ధరలకు గ్యాస్ సరఫరా చేస్తోంది. నల్గొండ ప్రాజెక్ట్ లో భాగంగా నల్గొండ జిల్లాలోని వెలిగొండ మండలం, సుంకిషాల గ్రామంలో సహజవాయువు సరఫరా లో కీలకమైన సిటీ గేట్ స్టేషన్ (CGS), మదర్ స్టేషన్ ను ప్రారంభించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్యాస్ సరఫరా సేవలను అందిస్తోంది మేఘా సంస్థ.

వ్యయ ప్రయాసాలు తగ్గించి సులభంగా ఇంటింటికి గ్యాస్ అందే విధంగా ‘మేఘా గ్యాస్’ పటిష్టమైన ప్రణాళికతో మౌళిక వసతులు కల్పించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలో అమలు చేస్తున్నట్లు మేఘా గ్యాస్ బిజినెస్ హెడ్ పలింపాటి వెంకటేశ్ తెలిపారు. ప్రజల అవసరాల దృష్ట్యా గ్యాస్ సిటీ గేట్ స్టేషన్ ద్వారా పీఎన్జీ ( piped natural gas) గృహ, పారిశ్రామిక అవసరాలకు, అలాగే మదర్ స్టేషన్ ద్వారా సీఎన్జీ (compressed Natural Gas)ని వాహన అవసరాల కోసం అందుబాటులోకి తీసుకురావడం ఎంతో గర్వకారణమన్నారు. దీంతో నల్గొండ జిల్లాలో మరో 10 స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నామని ఆయన తెలిపారు.

ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఇప్పటికే 32కి.మీల స్టీల్ పైప్ లైన్ వేయగా, మరో 80 కి.మీల పైప్ లైన్ పనులు కొనసాగుతున్నాయి. 40,000 కుటుంబాలకు & పరిశ్రమలకు గ్యాస్ సరఫరా చేసే ఉద్దేశ్యం తో ఇంకా 500కి.మీలు.. పొడవు గల ఎండీపీఈ పైప్ లైన్ నిర్మాణం చేపడుతున్నారు. అంతే కాకుండా మేఘా సంస్థ నల్గొండ జిల్లాలో బిబినగర్, భువనగిరి, చౌటుప్పల్, చిట్యాల, నల్గొండ, నకిరేకల్, మిర్యాలగూడ, మల్లేపల్లి, సూర్యాపేట మరియు కోదాడలలో 10 సీఎన్జీ స్టేషన్లు నిర్మిస్తున్నారు. సిజిడి ప్రాజెక్ట్ లో భాగంగా ఇంటింటికి గ్యాస్ సరఫరా చేయడానికి ఉమ్మడి నల్గొండతో పాటు రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పైప్ లైన్ నిర్మాణంతో పాటు 20 సిఎన్జి స్టేషన్లను త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నారు.

ఎంఈఐఎల్ ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, కర్నాటకలోని తూంకూరు – బెల్గాం జిల్లాలలో గ్యాస్ సరఫరాను ఇప్పటికే ప్రారంభించింది. కృష్ణా జిల్లాలోని నున్న సమీపంలో సిటి గ్యేట్ స్టేషన్ ద్వారా, అలాగే తూంకూరు – బెల్గాం జిల్లాల్లోనూ గ్యాస్ ప్రాజెక్ట్ ను ప్రారంభించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహ – వాణిజ్య అవసరాలకు నేరుగా గ్యాస్ సరఫరా చేయటం ద్వారా ఏకో ఫ్రెండ్లీ పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు అవసరమైన గ్యాస్ ను ఓఎన్జీసీ – గెయిల్ నుంచి పొందనుంది.

megha gas

మేఘా గ్యాస్ ‘ఇట్స్ స్మార్ట్ – ఇట్స్ గుడ్’ అనే ట్యాగ్ లైన్ తో తన సేవలను విస్తరిస్తున్న మేఘా గ్యాస్ గృహాలు – వాణిజ్య సంస్థలు – పారిశ్రామిక సంస్థలతో పాటు రవాణా వాహనాలకు సహజ వాయువును సరసమైన ధరకు అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని ఆగిరిపల్లిలో ఏర్పాటు చేసిన మదర్ స్టేషన్ నుంచి గ్యాస్ ను వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేందుకు స్టీల్ – ఎండిపీఈ పైప్ లైన్ ను 722 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేశారు.

కర్ణాటకలోని తూంకూరు జిల్లాలో కూడా ఇంటింటికి గ్యాస్ సరఫరా చేస్తోంది. వక్కోడి – హెగ్గేరి – గోళ్లహళ్లి – గొల్లరహతి – కుప్పూరు – దసముద్దేప్యా – సిరగతే – దిబ్బుర్ – గుళురు – సంతపేట – మరురూర్ దీన్నే – శేట్టిహళ్లి – జయనగర్ – గోకుల్ ఎక్స్ టెన్షన్ – ఖ్యాతిసాండ్రా – హీరేహళ్లి ఏరియా – మంచికల్ కుప్పె – బట్వాడీ – హనుమంతపురలో 595 కిలోమీటర్ల మేర పైప్లైన్ ఏర్పాటు చేసింది. అలాగే బెల్గామ్ జిల్లాలో బసవన్న కోళ్ల – ఆటోనగర్ – రాంతీర్థనగర్ – అశోక సర్కిల్ – ఆజాద్ నగర్ – చెన్నమ్మ సర్కిల్ – మారుతీ నగర్ – సదాశివ నగర్ తదితర ప్రాంతాల్లో 460 కిలోమీటర్ల మేర స్టీల్ – ఎండిపీ ఈ పైప్ లైన్ వేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!