HomeTelugu Big Storiesశ్రీమ‌తికి మహేష్‌ స్పెష‌ల్ విషెస్

శ్రీమ‌తికి మహేష్‌ స్పెష‌ల్ విషెస్

Mahesh babu Birthday Wishes
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు శ్రీమ‌తి న‌మ్ర‌త శిరోద్కర్‌ బ‌ర్త్‌డే నేడు. ఆమె పుట్టిన‌రోజు వేడుకల నిమిత్తం నిన్న (గురువారం) మ‌హేష్ ఫ్యామిలీతో సహా దుబాయ్ వెళ్ళారు. అక్క‌డ న‌మ్ర‌త బ‌ర్త్‌డే వేడుక‌ల‌ను ఘ‌నంగా జ‌రప‌నున్నాడు. జనవరి 22వ తేదీ 1972 సంవత్సరంలో జన్మించిన నమ్రత.. నేడు 49వ వ‌సంతంలోకి అడుగుపెట్టారు. ఆమె బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ప‌లువురు ప్ర‌ముఖులు బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. మ‌హేష్ అయితే త‌న శ్రీమ‌తికి స్పెష‌ల్ విషెస్ అందించారు. ఈ రోజు నేను ఎంతో ప్రేమించే వ్య‌క్తి పుట్టిన రోజు. ప్ర‌తి రోజు నీతో గ‌డ‌ప‌డం నాకు ప్ర‌త్యేకం. కాని ఈ రోజు మ‌రింత ప్ర‌త్యేకం. అద్భుత‌మైన స్త్రీతో అంద‌మైన రోజు.. ప్రేమ‌తో పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు లేడీ బాస్ అంటూ.. మ‌హేష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్ర‌తి నెటిజన్లను ఆక‌ట్టుకుంటుది. ప్రస్తుతం మహేష్‌ బాబు ‘స‌ర్కారు వారి పాట’ సినిమాతో బీజీగా ఉన్నాడు. పరశురామ్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu