HomeTelugu Trendingచిరంజీవి సినిమాతో జెనీలియా రీఎంట్రీ!

చిరంజీవి సినిమాతో జెనీలియా రీఎంట్రీ!

5 19టాలీవుడ్‌లో బాయ్స్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్‌ ఎంట్రీ జెనీలియా పెళ్లి తర్వాత సినిమాలకు బై చెప్పింది. బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకుని సెటిల్‌ అయిపోయింది ఈ బ్యూటీ. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం ‘నా ఇష్టం’. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు టాలీవుడ్ లో నటించడానికి ఆసక్తి చూపుతోంది జెనీలియా. ఇదే సమయంలో తెలుగు నుంచి ఆమెకు ఓ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. అది చిరంజీవి సినిమా కావడం విశేషం..

మలయాళంలో సూపర్ హిట్టయిన ‘లూసిఫర్’ చిత్రాన్ని చరణ్ తెలుగులో తన తండ్రి చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ‘ఆచార్య’ సినిమా తర్వాత చిరంజీవి ఈ సినిమా చేయనున్నారు. ఇందులో ఓ కీలక పాత్ర కోసం జెనీలియాను సంప్రదించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె కూడా ఈ పాత్ర చేయడానికి ఆసక్తిని చూపుతోందట. అయితే.. అమ్మడి టాలీవుడ్ రీ ఎంట్రీ చిరంజీవి చిత్రం ద్వారా జరిగే అవకాశం ఉంటున్నట్లు తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu