బాలకృష్ణ సినిమాకి .. బోయపాటి 15 కోట్లు పారితోషికం!


నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రూలర్’ ప్రేక్షకుల ముందుకు రావడానికిసిద్ధమవుతోంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, బాలకృష్ణ తదుపరి సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. బాలకృష్ణ తదుపరి సినిమాకి బోయపాటి శ్రీను దర్శకుడిగా వ్యవహరించనున్నాడు.

70 కోట్ల బడ్జెట్ తో మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకిగాను బాలకృష్ణ 10 కోట్ల పారితోషికాన్ని అందుకుంటూ ఉండగా, బోయపాటి పారితోషికం 15 కోట్లు అని తెలుస్తోంది. బాలకృష్ణ కంటే ఎక్కువ పారితోషికాన్ని ఆయన అందుకుంటూ ఉండటం, ‘వినయ విధేయ రామ’ వంటి భారీ పరాజయం తరువాత ఆయన ఆ స్థాయిలో డిమాండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే ఆమె ఆసక్తిని చూపకపోవడం వలన, మరో హీరోయిన్ ను సంప్రదిస్తున్నట్టుగా సమాచారం.

CLICK HERE!! For the aha Latest Updates