HomeTelugu Big Storiesగోదావరిలో ఘోర విషాదం, 12 మృతదేహాలు వెలికితీత

గోదావరిలో ఘోర విషాదం, 12 మృతదేహాలు వెలికితీత

1b 1
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో లాంచీ మునిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. అయితే, ఈ ప్రమాదం గురించి చాలా సందేహాలు ఉన్నాయి. బోటులో ఎంతమంది ఉన్నారు? ఎంతమందిని రక్షించారు, ఎంతమంది గల్లంతయ్యారు?, అనే అంశాలపై పర్యాటకుల బంధువులతోపాటు ప్రజల్లో కూడా గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా దానిపై సమగ్ర వివరాలను అందించింది.

లాంచీ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు జరుపుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇప్పటికే 8 ఈఆర్‌ బృందాలు, 12 మంది ప్రత్యేక గజ ఈతగాళ్ల బృందాలు, 6 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, రెండు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 2 హెలికాప్టర్ల ద్వారా ప్రత్యేక బృందాలు, నేవీ బృందాలతో పాటు గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. బోల్తా పడింది ఓ ప్రైవేట్ లాంచి అని దానికి అనుమతి లేదని పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్ ఇప్పటికే ప్రకటించారు.

గోదావరిలో మునిగిన లాంచీ 315 అడుగుల లోతుకు వెళ్లిపోయినట్లు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు గుర్తించాయి. ఎక్కువ లోతు, ప్రవాహం ఉధృతంగా ఉండడంతో లాంచీ వెలికి తీసేందుకు ఎక్కువ సమయం పడుతుందని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం తెలిపింది. గల్లంతైన వారిలో ఎక్కువ మంది లాంచీలో చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. లాంచి ప్రమాదంపై సోమవారం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఘటనా స్థలంలో పరిస్థితిని సమీక్షించారు. సహాయ చర్యలు మరింత ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాజమహేంద్రవరం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను పరామర్శించారు.

1 14

లాంచి ప్రమాదంలో ఇప్పటి వరకు 12 మృతదేహాలను వెలికి తీశారు. నిన్న రాత్రి 10 గంటల వరకు మృతదేహాల కోసం వెలికితీత చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం, చీకటి పడటంతో రాత్రి 10 తర్వాత గాలింపు చర్యలు నిలిపేశారు. ఈరోజు తెల్లవారుజామునుంచి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ధవళేశ్వరం వద్ద మృతదేహాల కోసం వలలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బోట్లలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ధవళేశ్వరం గేట్లు మూసేసి గాలిస్తున్నారు. మరోవైపు వర్షం పడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.

లాంచి ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని, ఇతర రాష్ట్రాల సీఎంలు, పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గల్లంతైన వారిలో తెలంగాణ వాసులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లా నుంచి 14 మంది పాపికొండలు పర్యటనకు వెళ్లగావారిలో 9 మంది ఆచూకీ దొరకలేదు. హైదరాబాద్‌కు చెందిన 20 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది.

1a 1

లాంచి ప్రమాదం జరిగినప్పుడు లైఫ్ జాకెట్లు ధరించిన వారు 16 మంది సేఫ్‌గా బయటపడినట్లు తెలిసింది. ఇప్పటి వరకు ప్రమాదం నుంచి 21 మంది సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. వీరంతా రాజమహేంద్రవరం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. లాంచిలో ఆరుగురు సిబ్బందితో పాటు 73 మంది ఉన్నట్లు చెబుతున్నారు. లాంచిలో ప్రమాదం నుంచి బయటపడిన పర్యాటకుడి కథనం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 1.30 తర్వాత లాంచి ప్రమాదానికి గురైంది. లాంచిలో 150 వరకు లైఫ్ జాకెట్లు ఉన్నాయని బోటు యజమాని చెబుతున్నాడు. భోజన సమయంలో లైఫ్ జాకెట్లు కొందరు తీసివేశారని తెలిసింది. కాసేపట్లో పాపికొండలు వస్తుందని, ఈ ప్రాంతంలో కొంత లోతు ఎక్కువగా ఉంటుందని.. లాంచి అటూ ఈటూ ఊగుతుంది ఎవరూ కంగారు పడొద్దని డ్రైవర్లు ప్రయాణికులను అప్రమత్తం చేశారట. ఆసమయంలో కొందరు లాంచి నుంచి దూకేసినట్లు ప్రత్యక్ష సాక్షి చెబుతున్నాడు. లాంచి ఒకవైపునకు ఒరిగినప్పుడు అందరూ ఒక వైపుకు వచ్చేయడంతో బ్యాలెన్స్ తప్పిందని సమాచారం. అదే సమయంలో కొందరు భయంతో పై ఫ్లోర్‌లోకి ఎక్కడం లాంచి బోల్తా కొట్టడానికి కారణమని అంటున్నారు. ఆ తర్వాత బోటులోని వారెవరూ కనిపించలేదు. నీటిలో దూకేసిన వారిని సమీపంలోని ప్రజలు బోట్లతో వచ్చి రక్షించారు. లైఫ్ జాకెట్లతో నీటిలో తేలుతున్న వారిని ఒడ్డుకు చేర్చారు. అలా 16 మంది సురక్షింతగా బయటపడ్డారు. ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు చనిపోయారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu