మహేష్‌కు నటనే రాదు.. ఆయన కంటే రాళ్లే నయం అంటూ.. సంచలన వ్యాఖ్యలు

స్టాండప్ కామెడీ షో వ్యాఖ్యాత మనోజ్ ప్రభాకరన్ ఒక షోలో మహేష్ బాబుని ఉద్దేశించి ‘స్పైడర్ సినిమాలో మహేష్ బాబు కంటే రాళ్లే నయం. ఆయనకు నటనే రాదు. నటనకు బదులు మోడలింగ్ చేస్కోవచ్చు కదా అంటూ కామెంట్స్ విసిరాడు. దీంతో మహేష్ అభిమానులకు కోపం నషాళానికి అంటుకుంది.

ఇంకేముంది ఫ్యాన్స్ అంతా కలిసి సోషల్ మీడియా మొత్తంలో ఆ స్టాండప్ కమెడియన్ ను పట్టుకుని విపరీతమైన ట్రోలింగ్ చేశారు. చేసిన కామెంట్స్ ను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో మనోజ్ ప్రభాకరన్ కు ఎంత పొరపాటు చేశాడో తెలిసొచ్చింది. తాను ఆ వ్యాఖ్యలను కామెడీ కోసం చేశానే తప్ప వ్యక్తిగత విమర్శ చేయాలని చేయలేదు. ఇప్పటికే ఈ విషయంపై క్షమాపణ చెప్పాను. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతటితో ఈ విషయాన్ని వదిలేద్దాం అంటూ అభిమానులకి, మహేష్ బాబుకి క్షమాపణ చెప్పాడు.