HomeTelugu Trending'సీటీమార్‌' టైటిల్‌ సాంగ్‌

‘సీటీమార్‌’ టైటిల్‌ సాంగ్‌

Seetimaar title song

టాలీవుడ్‌ యాక్షన్‌ హీరో గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో వస్తున్న తాజా చిత్రం ‘సీటీమార్‌’. క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. భూమిక కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ఇటీవల విడుద‌లైన ట్రైల‌ర్ కి మంచి స్పందన వ‌స్తోంది. తాజాగా `సీటీమార్` టైటిల్ సాంగ్‌ని స్టార్ హీరోయిన్ స‌మంత అక్కినేని విడుదల చేసింది. ఈ క్రమంలో సీటీమార్‌ టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు. మెలొడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందించగా.. అనురాగ్ కుల‌క‌ర్ణి, రేవంత్‌, వ‌రం అంతే ఎనర్జీతో ఆల‌పించారు. ఈ టైటిల్‌సాంగ్‌కి నెటిజన్లను ఆకట్టుకుంటుంది.. ఏప్రిల్ 2 ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుద‌ల‌ కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu