’18 పేజెస్‌’ ఫస్ట్‌లుక్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఈ రోజు (జూన్ 1) పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ’18 పేజెస్’. ‘కుమారి 21F’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్‌లో వహిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్టోరీ మరియు స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా నిఖిల్ కు బర్త్ డే విషెస్ అందిస్తూ ’18 పేజెస్’ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.

ఈ పోస్టర్ ద్వారా సినిమాలో సిద్ధు పాత్రలో నిఖిల్ సిద్ధార్థ్.. నందిని పాత్రలో అనుపమ నటిస్తున్నట్లు తెలిపారు. టైటిల్ తోనే సినిమాపై ఆసక్తి కలిగించిన మేకర్స్.. ఫస్ట్ లుక్ తో దాన్ని రెట్టింపు చేశారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై రానున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. వసంత్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. కాగా నిఖిల్‌కు బర్త్‌ డే విషెస్‌ తెలుపుతూ.. ‘కార్తికేయ 2’ నుండి న్యూ పోస్టర్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

CLICK HERE!! For the aha Latest Updates