HomeTelugu Trendingబాలయ్య షోకి రోజా!

బాలయ్య షోకి రోజా!

gossip roja in balakrishna

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో ‘అన్ స్టాపబుల్-2’. ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో వస్తున్న ఈ షోలో స్పెషల్ గెస్ట్ లతో అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్న రెండు ఎపిసోడ్స్ కి సూపర్ స్పందన వచ్చింది. ఇక ఈ సీజన్‌లో మూడో ఎపిసోడ్ లో రమ్యకృష్ణ, రాశీ ఖన్నాలు గెస్టులుగా రాబోతున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. మరో ఎపిసోడ్ కి మంత్రి రోజా గెస్ట్ గా రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు.

బాలకృష్ణ, రోజా కలిసి పలు సినిమాల్లో నటించారు. రాజకీయాల్లో వీరి మధ్య మాటల యుద్ధం జరుగుతునే ఉంటుంది. దీంతో నెటిజన్లు చాలా ఆసక్తికరంగా ఉన్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!