
Suriya Next Movie Budget:
వెంకీ అట్లూరి ‘తొలిప్రేమ’, ‘సార్’ మరియు తాజాగా ‘లక్కీ భాస్కర్’ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన మరో భారీ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నారు. అది మరెవ్వరితో కాదు… తమిళ స్టార్ హీరో సూర్యతో!
‘లక్కీ భాస్కర్’ సినిమాను చూసిన సూర్యకి అది ఎంతగానో నచ్చింది. వెంటనే వెంకీ అట్లూరితో సినిమా చేయడానికి ఓకే చెప్పాడట. ఈ సినిమా జూన్‌లో సెట్స్ మీదకి వెళ్లనుంది. ఇప్పటికే అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది.
ఈ సినిమా కోసం నిర్మాతలు రూ.120 కోట్ల భారీ బడ్జెట్‌ను ఖర్చు చేయడానికి రెడీ అయ్యారు. ఇందులో సూర్య ఒక్క తన రెమ్యూనరేషన్‌గానే రూ.50 కోట్లు తీసుకుంటున్నాడు. ఇది ఆయన గత సినిమాల ట్రాక్ రికార్డు తో పోల్చితే చాలా పెద్ద అంకే. ఎందుకంటే సూర్యకి ఈ మధ్యకాలంలో భారీ హిట్ లేదన్నది నిజం. అయినా కూడా ఆయనకు ఉన్న క్రేజ్, టాలెంట్ వల్లే నిర్మాతలు ఇంత బడ్జెట్ పెట్టడానికి రెడీ అవుతున్నారు.
ఇక సూర్య మాత్రం చాలా కాలంగా ఓ స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలని కోరుకుంటున్నాడు. ఈ ప్రాజెక్ట్‌తో ఆయనకు ఆ కోరిక నెరవేరనుంది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనుండగా, సంగీతాన్ని జీవీ ప్రకాష్ కుమార్ అందించనున్నాడు. ప్రస్తుతం మిగిలిన నటీ నటులు, టెక్నీషియన్ల ఎంపిక జరుగుతోంది.
వెంకీ అట్లూరి మలిచే ఈ తెలుగు-తమిళ మల్టీలాంగ్వేజ్ మూవీపై ఇప్పటినుంచే బజ్ మొదలైంది. త్వరలో టైటిల్ మరియు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. మంచి కథతో వస్తే, ఇది సూర్యకి టాలీవుడ్‌లో బ్రేక్ కావచ్చు!













