
War 2 Day 1 BO Collections:
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ జతకట్టిన ‘War 2’ సినిమాపై ఇండియా అంతటా భారీ అంచనాలు ఉన్నాయి. ‘WAR’ సిరీస్‌కి ఇది సీక్వెల్ కావడంతో, స్టైల్, యాక్షన్ లెవల్స్ ఎక్స్‌పెక్టేషన్ చాలా హైగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ కావడంతో తెలుగు ప్రేక్షకులలో కూడా ఆసక్తి పెరిగింది.
ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ సినిమా మొదటి రోజే కనీసం 80 కోట్లు నెట్ కలెక్షన్ సాధిస్తుందని అంచనా. అదే వర్డ్ ఆఫ్ మౌత్ బాగుంటే, రెండవ రోజు ఇండిపెండెన్స్ డే కావడంతో 100 కోట్లు నెట్ సాధించాలన్నదే అందరి ఆశ. ఇలా అయితే, ఇది బాక్సాఫీస్ హిస్టరీలో మొదటి బాలీవుడ్ మూవీగా ఒకేరోజు 90 కోట్లు రాబట్టిన చిత్రంగా నిలవవచ్చు.
ఇప్పటివరకు ఈ రికార్డులు:
50 కోట్లు – Thugs of Hindostan (ఆమీర్ ఖాన్)
60, 70 కోట్లు – Pathaan, Jawan (షారుఖ్ ఖాన్)
80 కోట్లు – Pushpa 2 (అల్లు అర్జున్)
ఇప్పుడు వీటన్నింటినీ దాటి పోయే పోటీలో ఉంది War 2. కానీ ఇదే రోజున Coolie (రజినీకాంత్, లోకేష్ కనగరాజ్) కూడా రిలీజ్ అవ్వడంతో సౌత్ మార్కెట్లో పోటీ ఉండొచ్చు. అయినా, హిందీ బెల్ట్‌లో ఈ సినిమా మీద ఉన్న మాస్ క్రేజ్ వల్ల కలెక్షన్లపై పెద్దగా ప్రభావం ఉండదనే అభిప్రాయం ఉంది.
కాబట్టి ఆగస్టు 14, 15 తేదీలలో ‘War 2’ ఎంత అద్భుతంగా కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఇది ఖచ్చితంగా బాక్సాఫీస్ రికార్డుల పండగ కాబోతుంది!