HomeTelugu TrendingSalman Khan Limited Edition వాచ్ ధర తెలిస్తే కళ్ళు తిరుగుతాయి

Salman Khan Limited Edition వాచ్ ధర తెలిస్తే కళ్ళు తిరుగుతాయి

Guess the price of Salman Khan Limited Edition Watch
Guess the price of Salman Khan Limited Edition Watch

Salman Khan Limited Edition Watch Cost:

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ కు లగ్జరీ వాచెస్ అంటే విపరీతమైన ఇష్టం. తాజాగా ఆయన ప్రసిద్ధ అంతర్జాతీయ బ్రాండ్ Jacob & Co తో కలసి ఓ ప్రత్యేకమైన వాచ్ డిజైన్ చేశారు. దీని పేరు “The World Is Yours Dual Time Zone – Salman Khan Edition”.

ఈ స్పెషల్ వాచ్ ను సల్మాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేస్తూ ప్రకటించారు. “నన్ను లాచి పెంచిన మా నాన్నగారికి అంకితం చేస్తూ ఈ వాచ్ రూపొందించాం” అంటూ భావోద్వేగంగా పోస్ట్ చేశారు. ఆయన తండ్రి సలీమ్ ఖాన్ కు ట్రిబ్యూట్‌గా రూపొందించబడిన ఈ వాచ్, ఇండియన్ త్రివర్ణ పతాకం నుంచి ఇన్స్పిరేషన్ పొందింది.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

వాచ్ డిజైన్‌లో కాషాయ, ఆకుపచ్చ రంగు అచ్చంగా ఉండగా, బ్యాక్‌లో వరల్డ్ మ్యాప్ ఎంగ్రేవింగ్, డయల్ పై ‘S.K.’ అనే ఇనిషియల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతేకాదు, ఈ వాచ్ ప్రత్యేకంగా టర్కాయిస్ బాక్స్ లో వస్తుంది – అదే సల్మాన్ ఖాన్ ఫేవరెట్ కలర్!

ఇప్పుడు అసలు విషయం – దీని ధర ఎంత? Ethos Watches వెబ్‌సైట్‌లో ఈ లిమిటెడ్ ఎడిషన్ వాచ్ రూ.36.6 లక్షలుగా లిస్టయింది!

ప్రస్తుతం వర్క్ ఫ్రంట్‌లో సల్మాన్ ఖాన్ వచ్చే జూలైలో గల్వాన్ వ్యాలీ ఘటనపై తెరకెక్కే అపూర్వ లఖియా డైరెక్షన్‌లోని మూవీ షూటింగ్ ప్రారంభించబోతున్నారు. అలాగే మలయాళ దర్శకుడు మహేష్ నారాయణన్ తో మరో ప్రాజెక్ట్ కూడా ప్రాథమిక చర్చల్లో ఉన్నాడు.

ALSO READ: బిగ్ బాస్ కంటే క్రేజీ షో Traitors వచ్చేసింది..

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!