హీరోయిన్‌ అమలాపాల్‌ ఇంట తీవ్ర విషాదం..


అమలాపాల్‌ ఇంట విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తండ్రి పౌల్‌ వర్గీస్‌ మంగళవారం రాత్రి కన్నుమూశారు. కాగా అమలాపాల్‌ తన తాజా చిత్రం ‘అదో అంద పరవై పోల’ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ వేడుకకు అమలాపాల్‌ చెన్నై విచ్చేసింది. ఈ సమయంలో తన తండ్రి మృతి చెందారన్న విషయం తెలియగానే హుటాహుటిన కేరళలోని తన స్వస్థలానికి పయనమైంది. నేడు కేరళలోని కురుప్పంపాడిలోని సెయింట్‌ పౌల్‌ క్యాథలిక్‌ చర్చిలో మధ్యాహ్నం 3, 4 గంటల ప్రాంతంలో ఆమె తండ్రి అంత్యక్రియలు జరగనున్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates