
నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన తాజా చిత్రం ‘బింబిసార’. ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా బింబిసార నిలిచింది. కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దర్శకుడు మల్లిడి వశిష్ఠ డెబ్యూ సినిమానే అయినా.. తన టేకింగ్‌కు, పాత్రలను మలిచిన విధానంకు సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. ఈ సినిమా విజయంలో సగం వరకు క్రెడిట్ కీరవాణికే దక్కుతుంది. ఈ మూవీలోని పాటలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కాగా తాజాగా ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ సినిమాలోని ‘బింబిసార’ అంటూ సాగే ఐటెం గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రీ రచించిన ఈ పాటను చిన్మయి శ్రీపద ఆలపించింది. ఈ సాంగ్‌లో సెట్టింగ్, విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి దాదాపు పది కోట్లకు పైగా లాభాలు వచ్చాయి. ఇలానే కంటిన్యూ అయితే ఈ ఏడాది డబుల్ బ్లాక్ బస్టర్ చిత్రాలలో బింబిసార కూడా చేరుతుంది. ఈసినిమా లో కేథరీన్ థ్రేసా, సంయుక్త మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. ఎన్‌టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్‌రామ్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.













