HomeTelugu Big Stories'గల్లీ రౌడీ' టీజర్‌ విడుదల

‘గల్లీ రౌడీ’ టీజర్‌ విడుదల

Gully Rowdy Movie Teaser
టాలీవుడ్‌ యంగ్‌ హీరో సందీప్ కిషన్, నేహాశెట్టి హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ‘గల్లీ రౌడీ’. ఆ మధ్య సందీప్ కిషన్ తో ‘తెనాలి రామకృష్ణ ఎల్.ఎల్.బి.’ చిత్రాన్ని రూపొందించిన జి. నాగేశ్వర రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. గీతాంజలి, నిన్నుకోరి’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ కలిసి మరోసారి చిత్ర నిర్మాణానికి పూనుకున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ఈరోజు (సోమవారం) సాయంత్రం విడుదలైంది. ‘గల్లీ రౌడీ’ టీజర్ ను విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా విడుదల చేశాడు. వైజాగ్ నేపథ్యంలో సాగే ఈ హెలేరియస్ కామెడీ చిత్రంలో డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ టీజర్ ఆద్యంతం వినోదంగా సాగింది. బాబీ సింహా, రాజేంద్రప్రసాద్, వైవా హర్ష, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. చౌరస్తా రామ్, సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu