Homeతెలుగు News'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసింది

‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసింది

Gumma Lyrical from Ambajipe

‘కలర్‌ఫొటో’ ఫేం సుహాస్ హీరోగా నటిస్తున్ తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. దుశ్యంత్‌ కటికినేని డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో శివానీ నగరం హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్‌కి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ గుమ్మా విడులైంది. ఈ సాంగ్‌ హీరోహీరోయిన్ల మధ్య సరదా ట్రాక్‌తో సాగుతుంది. రెహ్మాన్ రాసిన ఈ పాటను శేఖర్ చంద్ర కంపోజిషన్‌లో స్వయంగా పాడాడు. ఓ వైపు హెయిర్ సెలూన్ నడిపిస్తూ.. మరోవైపు మ్యారేజి బ్యాండు టీంలో కలిసి పనిచేసే సుహాస్‌.. శివానీతో లవ్‌లో పడతాడు.

ఈ సినిమాలో పుష్ప ఫేం జగదీశ్‌ ప్రతాప్‌ బండారి, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని గీతా ఆర్ట్స్‌ 2, మహాయణ మోషన్ పిక్చర్స్‌, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu