
స్టార్ హీరో మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా మహేశ్ బాబు 28 వ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ చిత్రంలో టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.
కాగా ఇటీవలే గుంటూరు కారం నుంచి దమ్ మసాలా లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేయగా.. సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా సెకండ్ సింగిల్ అప్‌డేట్ అందించారు నిర్మాత నాగవంశీ. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్‌లో థ్రిల్లింగ్ అప్‌డేట్ అందించారు.
వచ్చే వారం రెండో పాటను లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. అంతేకాదు ఈ చిత్రంలో మొత్తం 4 పాటలుండబోతున్నాయని క్లారిటీ ఇచ్చాడు. గుంటూరు కారంలో మీనాక్షి చౌదరి మరో ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.
ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Wishing our talented director #TrivikramSrinivas a blockbuster birthday and a spectacular year ahead !! 🤗❤️ pic.twitter.com/QbJsWrQqIE
— Mahesh Babu (@urstrulyMahesh) November 7, 2023













