HomeTelugu Trendingగుంటూరులో ల్యాండైన 'గుంటూరు కారం' టీమ్‌

గుంటూరులో ల్యాండైన ‘గుంటూరు కారం’ టీమ్‌

Guntur kaaram team pic vira
సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. మహేష్‌ బాబు హీరోగా నటిస్తున్న28వ చిత్రం ఇది. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో మహేశ్ బాబు టీం ప్రమోషనల్ ప్లాన్‌లో బిజీగా ఉంది.

ఈ రోజు గుంటూరులో ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సందడి నెలకొంది. ఈవెంట్‌ కోసం త్రివిక్రమ్, మహేశ్ బాబు టీం ప్రత్యేక విమానంలో గుంటూరుకు వెళ్లారు. ఈ సందర్భంగా విమానంలో దిగిన ఫొటోను ఎస్‌ఎస్ థమన్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. మ‌హేష్‌, త్రివిక్ర‌మ్, థ‌మ‌న్, దిల్ రాజు, రాధాకృష్ణ‌, నాగ‌వంశీ, హీరోయిన్లు మీనాక్షి చౌద‌రి, శ్రీలీల అంతా క‌లిసి ఒకే ప్లైట్ లో గుంటూరుకి వెళ్లారు.అభిమానులు జై బాబు..జైజై బాబు అంటూ గుంటూరు గ్యాంగ్ కి గ్రాండ్ గా వెల్క‌మ్ చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

ఈ స్టిల్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ మూవీ సాంగ్స్‌తో మహేశ్‌బాబు, శ్రీలీల ఊరమాస్ స్టెప్పులతో థియేటర్లలో మోత మోగించడం ఖాయమని తెలిసిపోతుంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్‌ రాధాకృష్ణ (చినబాబు) తెరకెక్కిస్తుండగా.. ఎస్‌ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ సంగీతం అందిస్తున్నాడు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu