HomeTelugu Trending'గుంటూరు కారం' ఫస్ట్‌ సింగిల్‌ అప్డేట్‌

‘గుంటూరు కారం’ ఫస్ట్‌ సింగిల్‌ అప్డేట్‌

Guntur Karam first single

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ మూవీని జనవరి 12న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, జగపతి బాబు, రఘుబాబు, సునీల్ తదితరులు కనిపించనున్నారు.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి దమ్ మసాల అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ ప్రోమోని రేపు ఉదయం 11 గం. 7ని. లకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. కాగా ఫుల్ సాంగ్ ని నవంబర్ 7న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu