HomeTelugu Trendingవెబ్‌ సిరీస్‌గా గ్యాంగ్‌స్టర్ 'వికాస్ దూబే' బయోపిక్‌

వెబ్‌ సిరీస్‌గా గ్యాంగ్‌స్టర్ ‘వికాస్ దూబే’ బయోపిక్‌

hansal mehta directs web se
ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా బయోపిక్స్‌ వచ్చాయి. కాదా ఇటీవలే ఉత్తర ప్రదేశ్‌ పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురైన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబే జీవితం ఆధారం ఓ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కనుంది. థ్రీల్లర్‌ నేపథ్యంలో సాగే ఈ వెబ్‌ సిరీస్‌ బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా డైరెక్షన్‌లో వస్తుంది. అత్యంత కరుడుగట్టిన నేరస్థుడు వికాస్‌ దూబే నిజ జీవిత కథ ఆధారంగా చిత్రీకరిస్తున్నందున ఈ సినిమాను తెరకెక్కించేందుకు నిర్మాత శైలేష్ ఆర్ సింగ్ అధికారిక అనుమతులు కూడా పొందినట్లు తెలుస్తోంది.

దీనిపై డైరెక్టర్‌ హన్సల్ మెహతా మాట్లాడుతూ… తాము తీయబోయే ఈ థ్రీల్లర్‌ వెబ్‌ సిరీస్‌ అంత్యంత ఆసక్తికరంగా ఉండబోతుందన్నారు. గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఉదంతంలో ఓ పొలిటికల్ థ్రిల్లర్ పాయింట్ ఉందని, దానిని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు చెప్పాడు. అది అందరికి ఆశ్చర్యం కలిగిస్తుందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇటీవల యూపీ పోలీసుల చేతిలో హతమైన వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌ వార్త సంచలనమైన విషయం తెలిసిందే. ఎనిమిది మంది పోలీసులను కాల్చి చంపిన రోజుల వ్యవధిలోనే పోలీసుల తూటాకు వికాస్‌ దూబే బలయ్యాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!