HomeTelugu Trending'హనుమాన్‌' అప్డేట్‌

‘హనుమాన్‌’ అప్డేట్‌

Hanuman movie shooting upda
టాలీవుడ్‌ యువ దర్శకుడు ప్రశాంత్‌వర్మ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రం ‘హనుమాన్’. ఇప్పటికే విడుదలైన హనుమాన్‌ టీజర్‌ హాలీవుడ్‌ స్థాయిలో స్టన్నింగ్‌ విజువల్స్‌ తో సాగుతూ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్‌డేట్‌ ఒకటి సినిమా ఎలా ఉండబోతుందో చెబుతోంది.

హనుమాన్ లో అండర్ వాటర్‌ సీక్వెన్స్ షాట్స్ మైండ్‌ బ్లోయింగ్‌గా ఉండబోతున్నాయి. స్పెషల్ సెట్స్‌ లో ఈ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నపుడు తీసిన స్టిల్స్ ను ఈ మూవీ టీం సోషల్‌ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. పాపులర్‌ టెక్నీషియన్స్ పర్యవేక్షణలో షూట్‌ తీస్తున్న ఈ సీన్లు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా ఉండబోతున్నాయట.

తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్‌గా తేజ సజ్జ హీరోగా వస్తున్న హనుమాన్‌ ను యూనివర్సల్‌ ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా తీస్తున్నట్టు విజువల్స్‌ తో అర్థమైపోతుంది. శ్రీమతి చైతన్య సమర్పణలో తెరకెక్కుతున్న హనుమాన్‌ చిత్రానికి గౌరహరి-అనుదీప్‌ దేవ్‌, కృష్ణ సౌరభ్‌ సంగీతం అందిస్తున్నారు. అస్రిన్‌ రెడ్డి, వెంకట్‌ కుమార్ జెట్టీ, కుశాల్‌ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఫిక్షనల్‌ నేప‌థ్యంలో వస్తున్న హను-మాన్ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!