హ్యాపీ బర్త్ డే రామ్‌ చరణ్‌

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చిరుత మూవీతో అడుగుపెట్టిన రామ్ చరణ్ మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ తరువాత రాజమౌళితో చేసిన మగధీర అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసింది. మెగా పవర్ స్టార్ తో పాటు ఆ సినిమాలో మెగాస్టార్ ఇచ్చిన ఎంట్రీ అద్భుతం అని చెప్పాలి. అక్కడి నుంచి ఈ మగధీరుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరస హిట్స్ తో దూసుకుపోయాడు.

కోలీవుడ్ లో సూపర్ హిట్టైన తని ఒరువన్ సినిమాను తెలుగులో దృవ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా చరణ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. నటనలో చాలా వైవిధ్యం కనబరిచారు. దీని తరువాత చేసిన రంగస్థలం సినిమా మరో రికార్డును సృష్టించింది. చరణ్ లోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. మార్చి 27 న పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ మగధీరుడు ఇండస్ట్రీలో ఎన్నో హిట్స్ కొట్టాలని కోరుకుందాం.

CLICK HERE!! For the aha Latest Updates