మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు (ఆగస్టు 22) మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు.. అంటే అభిమానులకు పండుగే. ఒకప్పుడు హంగామా ఓ రేంజ్‌లో ఉండేది. రోజంతా టీవీ, రేడియో అన్నింట్లోనూ చిరంజీవి పాటలతో నిండిపోయేవి. అభిమాన సంఘాల నాయకులు వేడుకలు ఎంతో ఘనంగా చేసేవాళ్ళు. 2007 వరకు ఈ హంగామా చాలా జోరుగా సాగింది. 2008 లో చిరు రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత ఆ స్పీడ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. అందరివాడుగా ఉన్న మెగాస్టార్ రాజకీయాల్లోకి వెళ్లాక కొందరివాడుగా మారిపోయాడు. అప్పట్లో రాజకీయాల్లో బిజీగా ఉండటంతో చిరంజీవి కూడా తన పుట్టిన రోజు వేడుకలపై పెద్దగా ఆసక్తి చూపలేదు. సినిమాలకూ దూరంగా ఉన్నాడు

2015 తరువాత సీన్‌ పూర్తిగా మారిపోయింది. 2015లో 150 వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ తో మెగాస్టార్‌ రీఎంట్రీ ఇచ్చాడు . 2017 జనవరి 11 న ఈ సినిమా విడుదల అయ్యింది. సూపర్ హిట్ కావడమే కాకూండా మెగాస్టార్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు వసూళ్లు చేసిన సినిమాగా నిలిచింది. అదే ఏడాది మెగాస్టార్ తన ‘151’ వ సినిమా సైరాను మొదలుపెట్టారు. ఈ సినిమా టీజర్ మోషన్ కూడా అప్పుడే రిలీజ్ చేశారు. ఆ తరువాత కొన్ని రోజులకు ఫస్ట్ టీజర్ విడుదలైంది. ఈ ఏడాదిఆగష్టు 14 వ తేదీన ‘సైరా’కు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఆ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఆగస్ట్ 20 న ముంబైలో మెగాస్టార్ సైరా టీజర్ రిలీజ్ అయ్యింది. అక్టోబర్ 20 వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్నది. మెగాస్టార్ పుట్టినరోజైన నేడు తన 152 వ సినిమాను ప్రకటించబోతున్నారు.

తన సినిమాను ప్రేక్షకుల ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 ద్వారా రుజువు చేశారు. ఈసారి కూడా ఎప్పటిలాగే ఓ రోజు ముందుగానే మెగాస్టార్ బర్త్ డే సంబరాలు జరిగాయి. పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఇలాంటి పుట్టినరోజులు మెగాస్టార్ మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.