HomeTelugu Trendingడైరెక్టర్‌గా మారనున్న యంగ్‌ హీరో

డైరెక్టర్‌గా మారనున్న యంగ్‌ హీరో

Young Hero As A Director
టాలీవుడ్‌ యంగ్ హీరో నిఖిల్ మంచి జోష్‌ మీదున్నాడు. డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ.. విజయాలను సాధిస్తున్నాడు. చివరగా ‘అర్జున్ సురవరం’ సినిమాతో హిట్ అందుకున్న నిఖిల్ ఆ తర్వాత రెండు సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. వాటిలో ఒకటి గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో ’18 పేజెస్ సినిమా మరొకటి కార్తికేయ2. ఈ రెండు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి అయితే ఇన్నిరోజులు కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న షూటింగ్ను త్వరలోనే ప్రారంభించాలని చూస్తున్నారు చిత్ర బృందం. ఇదిలా ఉంటే ఈ హీరో త్వరలో డైరెక్టర్ గా మారుతాని అంటున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. నటుడు కాకముందు `హైదరాబాద్ నవాబ్స్` చిత్రానికి లక్ష్మీ కాంత్ చెన్న వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు నిఖిల్. అనుభవంతో ఇప్పుడు దర్శకుడిగా మారాలనుకుంటున్నాడు. త్వరలో ఒక ప్రయోగాత్మక పిల్లల చిత్రంతో దర్శకుడిగా మారనున్నట్లు నిఖిల్ వెల్లడించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!