టీఆర్‌ఎస్‌ పై హరీష్‌ శంకర్‌ ట్వీట్‌

తెలంగాణలో ఈరోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో ఉంది. మొదటి రౌండ్‌ ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ గెలుస్తుందా? లేదా? అనే విషయం 11-11.30 గంటల సమయంలో తెలిసిపోతుందని అనుకున్నారు కానీ తెలంగాణలో టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని కౌంటింగ్‌ సరళి చెప్పేస్తోంది.

ఈ విషయంపై ప్రముఖ దర్శకుడు హరీష్‌ శంకర్‌ ట్వీట్‌ చేశారు. ’11-11.30 గంటల సమయంలో ఏ విషయం అన్నది తెలిసిపోతుందని అన్నారు. కానీ ముందుగానే తెలిసిపోయింది. ఇది ప్రజాస్వామ్య పవర్’ అని హరీష్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. మరోవైపు ఎన్నికల ఫలితాల్లో టీర్‌ఎస్‌ దూసుకెళుతోంది. గజ్వేల్‌ నియోజకవర్గంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.