ఐటమ్ సాంగ్స్ ఇక ఉండవేమో!

ప్రస్తుతం ఇండియాలో #Me Too ఉద్యమం ఎఫెక్ట్‌ అన్ని రంగాలను ఊపేస్తోంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ గడగడలాడిపోతుంది. ఇప్పటికే దీని ప్రభావంతో.. అనేక మంది స్టార్ సెలబ్రిటీల జీవితాలు అయోమయంలో పడిపోయాయి. సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఒక సినిమా హిట్ కావాలంటే.. సాధారణ ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు
సినిమాలో ఉండాలి. ముఖ్యంగా హీరోయిన్లను గ్లామర్ గా చూపించాలి. ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి. పాటలు జోష్ గా ఉండాలి. హీరోయిజం.. కామెడీ ఇలా అన్నీ ఉండాలి.

ప్రేక్షకుడు కోరుకునేవన్నీ ఉంటేనే సినిమాలు అంతంత మాత్రం ఆడుతుంటాయి. అలాంటిది సినిమాలో గ్లామర్ లేకుంటే సినిమా ఆడకపోతే నిర్మాతకు నష్టమే. మీటు ఎఫెక్ట్ వలన ఇప్పుడు అదే జరిగేటట్టు ఉంది. ఐటమ్ సాంగ్స్ ఉంటే ఏం గొడవలు వస్తాయో.. అని దర్శక, నిర్మాతలు భయపడిపోతున్నారు. ప్రముఖ దర్శకుడు విశాల్ భరద్వాజ్ తన పటాకా సినిమాలో హెలో హెలో అనే ఐటమ్ సాంగ్ ను చిత్రీకరణ చేశారు. మలైకా అరోరాపై చిత్రీకరించిన ఈ ఐటమ్‌ సాంగ్ బాగా వచ్చిందట. మీటు ఎఫెక్ట్ కు భయపడి ఎందుకొచ్చిన గొడవలే అని సాంగ్ ను సినిమా నుంచి తొలగించారట.