
Tollywood IT raids reason:
బాలీవుడ్‌పై మాఫియా ప్రభావం గురించి తరచుగా వినిపిస్తూనే ఉంటుంది. సినీ రంగంలో ప్రముఖులను ప్రోత్సహించడం, కొందరిని అణగదొక్కడం వంటి వ్యవహారాల్లో ఈ మాఫియా హస్తం ఉందని భావించేవారు ఉన్నారు. ఇప్పుడు ఇదే డిస్కషన్ టాలీవుడ్లో కూడా ప్రారంభమైంది.
ఇటీవల మూడు ప్రముఖ నిర్మాణ సంస్థలు – మైత్రీ మూవీ మేకర్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌పై ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరిగాయి. ఈ రైడ్స్‌తో మాఫియా లింకులపై కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి.
మైత్రీ మూవీ మేకర్స్:
ఈ సంస్థ పుష్ప 2 విజయంతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ‘జాట్’ అనే ప్రాజెక్ట్ పనుల్లో ఉంది. ఇది కాకుండా బాలీవుడ్ స్టార్స్‌కు కూడా అడ్వాన్స్‌లు ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
దిల్ రాజు ప్రొడక్షన్స్:
ఆమిర్ ఖాన్‌తో పని చేయడానికి ప్లాన్ చేస్తున్న దిల్ రాజు, వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్:
‘కార్తికేయ 3’ వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో పేరు తెచ్చుకున్న ఈ సంస్థ, ప్రస్తుతం ‘వాక్సిన్ వార్’ అనే ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఈ రైడ్స్ టైమింగ్‌తో కొత్త డౌట్స్ బయటపడ్డాయి. బాలీవుడ్లో విజయాలు తగ్గి, టాలీవుడ్ ప్రభావం పెరుగుతుండడంతో, టాలీవుడ్‌ను ఆపడానికి మాఫియా మళ్లీ కదిలిందా అన్న ప్రశ్నలు ఊహగానాల్ని పెంచాయి.
ఇవి సాధారణ ఐటీ రైడ్సే కావొచ్చు. కానీ వీటి టైమింగ్, పాన్ ఇండియా చిత్రాలు టార్గెట్ చేయడమే ఈ వివాదానికి మళ్లీ ఊపునిచ్చాయి. నిజం ఏదైనా, ఈ ఊహగానాలు మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
ALSO READ: తెలంగాణలో Revanth Reddy మొదలుపెట్టిన 4 సరికొత్త పథకాలు!