HomeTelugu Big StoriesPushpa 2 తో పోలిస్తే Game Changer చేస్తున్న తప్పు ఇదేనా?

Pushpa 2 తో పోలిస్తే Game Changer చేస్తున్న తప్పు ఇదేనా?

Here's why Game Changer is far behind Pushpa 2 in terms of promotions!
Here’s why Game Changer is far behind Pushpa 2 in terms of promotions!

Game Changer vs Pushpa 2 promotions:

సోషియల్ మీడియా ప్రస్తుత సినీ ప్రమోషన్లలో కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే సినిమా విడుదల కి ముందు చిత్ర బృందాలు సోషల్ మీడియాలో ప్రమోషన్స్ మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు. ఈ క్రమంలో పుష్ప 2, గేమ్ ఛేంజర్ సినిమాల విషయంలో కూడా సోషల్ మీడియాలో భారీ ప్రమోషన్లు జరుగుతున్నాయి. అయితే ఈ రెండు సినిమాలతో పోలిస్తే పుష్ప 2 సోషల్ మీడియాని చాలా సమర్థవంతంగా వాడారు అని కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ మధ్య ఉన్న కీలకమైన తేడాలు ఒకసారి చూద్దాం..

1. ఎంగేజ్మెంట్ స్ట్రాటజీ:

పుష్ప 2 ప్రమోషన్‌లో వినూత్నంగా Snapchat లాంటి ప్లాట్‌ఫార్మ్‌లను ఉపయోగించింది. ఫ్యాన్స్‌తో నేరుగా కనెక్ట్ అయ్యేలా బీహైండ్-ది-సీన్స్ కంటెంట్, ఇంటరాక్టివ్ AR ఫిల్టర్లను అందుబాటులో తెచ్చింది. ఈ విధంగా ప్రేక్షకుల్లో ప్రత్యేక అనుభూతి కలిగించింది.
మరోవైపు, గేమ్ ఛేంజర్ ఓల్డ్ ప్రమోషన్ పద్ధతులపైనే ఎక్కువగా ఆధారపడి, సోషియల్ మీడియా ద్వారా అభిమానులతో నేరుగా కలిసే అవకాశాలను తక్కువగా వినియోగించింది.

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)

2. ప్రాంతీయ దృష్టి:

పుష్ప 2 హిందీ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ పాట్నాలో ట్రైలర్ లాంచ్ చేసింది. ఈ క్యాంపైన్ సోషల్ మీడియాలో పెద్ద చర్చలకు దారి తీసింది, భాషా భేదాలను దాటి ప్రేక్షకులను ఆకర్షించింది.
గేమ్ ఛేంజర్ అయితే ఈ తరహా ప్రాంతీయ వ్యూహాలు లేకుండా సింపుల్ గా డల్లాస్ లో మాత్రం ఒక మామూలు ఈవెంట్ ప్లాన్ చేసింది. వేరే భాష ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నాలు చేయడం లేదు.

3. బ్రాండ్ భాగస్వామ్యాలు:

పుష్ప 2 పలు బ్రాండ్ పార్టనర్‌షిప్‌లతో భారీ స్థాయిలో ప్రచారం పొందింది. ఈ కొలాబొరేషన్ లు సోషియల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంతో, సినిమా మీద అన్ని వర్గాల ప్రజలకి అవగాహన పెరిగింది. గేమ్ ఛేంజర్ ఈ తరహా బ్రాండ్ భాగస్వామ్యాలను తక్కువగా వినియోగించడం వల్ల ఆన్‌లైన్‌లో పాపులారిటీని తెచ్చుకోలేకపోయింది.

ఓవరాల్ గా పుష్ప 2 సోషియల్ మీడియా అడ్వాంటేజ్ లని పూర్తిగా ఉపయోగించుకొని, అన్ని వర్గాల ప్రేక్షకులను చేరుకుంది. ఫ్యాన్స్‌తో నేరుగా కనెక్ట్ అవడం, పర భాషా ప్రజలను టార్గెట్ చేయడంతో బాగా క్రేజ్ తెచ్చుకుంది.
గేమ్ ఛేంజర్ అయితే ఈ పద్ధతులను పూర్తిగా అనుసరించకపోవడం వల్ల ప్రమోషన్‌లో కొన్ని అవకాశాలను కోల్పోయింది. సోషియల్ మీడియా వాడకాన్ని మెరుగుపరచడం ఈ చిత్రానికి అవసరమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ALSO READ: కెరియర్ లోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకోబోతున్న Chiranjeevi.. ఎంతంటే!

Recent Articles English

Gallery

Recent Articles Telugu