
Icon Movie Update:
అల్లు అర్జున్, వేణు శ్రీరామ్, దిల్ రాజు కాంబినేషన్‌లో “ఐకాన్” అనే ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యి చాలా కాలమే అయ్యింది. అల్లు అర్జున్ అప్పట్లో ఈ సినిమాను సీరియస్‌గా తీసుకొని, ఐకాన్ క్యాప్‌లు, టీషర్ట్‌లు వేసుకొని ప్రమోట్ కూడా చేశాడు. కానీ ఆ తరువాత “అల వైకుంఠపురములో” బ్లాక్‌బస్టర్ అవ్వడంతో ఎవరూ ఊహించని విధంగా స్కెచ్ మార్చేశారు.
పుష్ప మొదలయ్యాక బన్నీ వెనక్కి చూసే టైమ్ కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఆయన చేతిలో పుష్ప: ది రాంపేజ్ తో పాటు అట్లీ డైరెక్షన్ లో మరో భారీ ప్రాజెక్ట్ ఉంది. దాంతో ఐకాన్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశారు.
ఇక వెనుక ముందు చూస్తూ ఉండలేని దిల్ రాజు – వేణు శ్రీరామ్ ఇద్దరూ ఈ ప్రాజెక్ట్‌ను మరో హీరోతో తీయాలని డిసైడ్ అయ్యారు. మొదట నితిన్ తో ప్లాన్ చేశారు కానీ ఆ కాంబోలో “తమ్ముడు” అనే సినిమా మొదలై, జూలై 4న రిలీజ్‌కి రెడీ అవుతోంది.
ఇప్పుడు టాలీవుడ్ లో “ఐకాన్” పాత్రకి బెస్ట్ ఫిట్ ఎవరు?” అన్నదే హాట్ టాపిక్. తాజా సమాచారం ప్రకారం, నాని పేరు ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది. క్లాస్ & మాస్ బేస్ ఉన్న హీరో కావడం, డిఫరెంట్ కాన్సెప్ట్‌లకు రెడీగా ఉండే నేచురల్ స్టార్ కావడం అతనికి ప్లస్.
ఇక బన్నీ బిజీగా ఉండడం, స్క్రిప్ట్ స్టేజిలో ఉండే ఈ కథను మళ్ళీ అతనితో చేయడం తక్కువ ఛాన్స్ అంటున్నారు ఇండస్ట్రీలో. దాంతో “ఐకాన్” ప్రాజెక్ట్ మరో హీరో చేతుల్లోకి వెళ్లే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది.
ALSO READ: Aamir Khan నెట్ వర్త్ ఇన్ని వందల కోట్లా? ఎంతంటే..













