ట్రెండ్‌ సెట్‌ చేస్తున్న ‘మహర్షి’ ట్రైలర్‌

సూపర్‌ స్టార్‌ మహేష్ నటించిన తాజా సినిమా ‘మహర్షి’ ట్రైలర్ నిన్ననే విడుదలైంది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ట్రైలర్ విడుదలైన కొద్దిసేపటికే 2 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసేసింది. ట్రైలర్ కంటెంట్ బాగుండటంతో అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ మొదటి స్థానంలో ట్రెండ్ అయింది. అభిమానుల నుండి వస్తున్న ఆదరణ చూస్తుంటే ఈ ట్రైలర్ వ్యూస్ పరంగా సరికొత్త రీకార్డులు క్రియేట్ చేసేలా కనబడుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 9న విడుదలకానుంది. ఇది మహేష్ చేసిన 25వ చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో తారాస్థాయి అంచనాలున్నాయి. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.