
Oscars 2025 gift bag:
ఒస్కార్ అవార్డులు అంటే సినిమా రంగంలో అత్యున్నత గౌరవం. 1929 నుంచి ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక అవార్డులు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షిస్తారు. సినీ తారలు, దర్శకులు, సంగీతకారులకు ఇది ఓ గొప్ప గుర్తింపు. కానీ, ఒస్కార్స్ కేవలం అవార్డుల కోసమే కాదు – నామినీలకు ఇచ్చే లగ్జరీ గిఫ్ట్ బ్యాగ్ కూడా ప్రత్యేక ఆకర్షణ.
ఓస్కార్ 2025 గిఫ్ట్ బ్యాగ్‌లో ఏముందో తెలుసా?
ప్రతి ఏడాదిలాగే, ఈసారి కూడా Distinctive Assets అనే లాస్ ఏంజిల్స్ కంపెనీ ఈ ప్రత్యేక గిఫ్ట్ బ్యాగ్‌ను డిజైన్ చేసింది. అవార్డు గెలుచుకోవలసిన అవసరం లేకుండా నామినీలు మాత్రమే ఈ విలాసవంతమైన గిఫ్ట్‌లను పొందుతారు!
లగ్జరీ ట్రిప్స్ & హోటల్ స్టేలు:
*శ్రీలంకలో 5 రోజుల వెల్నెస్ రిట్రీట్
*JOALI మాల్దీవుల్లో 4 రాత్రుల సూపర్ లగ్జరీ స్టే
*స్పెయిన్ బార్సిలోనాలో ఫైవ్ స్టార్ హోటల్ ‘Cotton House’లో ఉచిత వసతి
బ్యూటీ & వెల్నెస్ గిఫ్ట్‌లు:
*మియాజ్ లగ్జరీ స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్
*L’Oréal Paris హైఎండ్ కాస్మెటిక్ గిఫ్ట్ ప్యాక్
*ప్రఖ్యాత ప్లాస్టిక్ సర్జన్ Dr. Thomas Su అందించే బాడీ కాంటూరింగ్ ట్రీట్మెంట్
*Petty Pout లిప్ కేర్ గిఫ్ట్ సెట్
కాల్పుల బాధితులకు మద్దతు:
*Bright Harbor సంస్థ ద్వారా $1 మిలియన్ విలువైన సహాయ సేవలు
*Maison Construction ద్వారా హోం రినోవేషన్
ఇతర లగ్జరీ ఐటమ్స్:
*TruFru నుంచి చాక్లెట్ కవర్ చేసిన రాస్బెర్రీలు
*లగ్జరీ క్యానబిస్ ప్రొడక్ట్స్ Beboe నుంచి
*OMGIGI జ్యువెలరీ వర్చువల్ ఎక్స్‌పీరియెన్స్
*Cate Brown Studio నుంచి డాగ్ వేర్ & టాస్ పిలోస్
*Nomatic ట్రావెల్ ప్యాక్
“AncestryDNA కిట్ – కుటుంబ మూలాలను తెలుసుకోవడానికి
ఓస్కార్ 2025 ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
👉 మార్చి 2, 2025 – అమెరికాలో సాయంత్రం 4 PM (PT) / 7 PM (ET)
👉 భారతదేశంలో మార్చి 3, ఉదయం 4 AM (IST) – Disney+ Hotstar, Star Movies
అవార్డు గెలిచినా, గెలవకపోయినా ఈ లగ్జరీ గిఫ్ట్ బ్యాగ్ మాత్రం అందరికీ అదనపు సంతోషాన్ని ఇస్తుంది!
ALSO READ: BARC ప్రకారం ఏ TV Channel కి ఎక్కువ రేటింగ్ ఉందంటే