HomeTelugu Trendingహీరో అర్జున్‌ సర్జా ఇంట తీవ్ర విషాదం

హీరో అర్జున్‌ సర్జా ఇంట తీవ్ర విషాదం

Hero arjun mother passes aw

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ సర్జా ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి లక్ష్మి దేవమ్మ ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఆమె వయస్సు 85. తల్లి మరణంతో హీరో అర్జున్‌ ఇంట ఒక్కసారిగా విషాద చాయలు నెలకొన్నాయి. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపుడుతున్న ఆమె శనివారం(జూలై 23న) బెంగళూరులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

లక్ష్మి దేవమ్మ మృతి పట్ల కన్నడ పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తూ అర్జున్‌ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. కాగా లక్ష్మి దేవమ్మ మైసూర్‌లో స్కూల్‌ టీచర్‌గా పనిచేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!