HomeTelugu Trendingతన లవర్‌కు స్టేజిపైనే ప్రపోజ్‌ చేసిన హీరో కార్తికేయ

తన లవర్‌కు స్టేజిపైనే ప్రపోజ్‌ చేసిన హీరో కార్తికేయ

Hero Karthikeya propose his
టాలీవుడ్‌ యంగ్ హీరో కార్తికేయ శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ లో నటిస్తున్న తాజా చిత్రం “రాజా విక్రమార్క”. ఈ సినియాలో కార్తికేయ ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. వి. వి. వినాయక్ శిష్యుడైన శ్రీసరిపల్లి డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని డబుల్ ఎయిట్ రామరెడ్డి నిర్మిస్తున్నారు. సీనియర్ కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మరో యువ నటుడు సుధాకర్ కోమాకుల ఓ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నాడు. అయితే.. నిన్న “రాజా విక్రమార్క” ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. అయితే..ఈ రాజ విక్రమార్క మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేదికపై ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తన లవర్‌‌, కాబోయే భార్య లోహితకు కార్తికేయ స్టేజిపైనే ప్రపోజ్‌ చేసాడు. ప్రేమ కోసం నా లైఫ్‌లో హీరో అవ్వడానికి పెట్టినంత స్ట్రగుల్‌ పెట్టానని అన్నాడు కార్తికేయ. ఆ అమ్మాయితో ఈ నెల 21న వివాహం జరగనుంది. తన పేరు లోహిత అని కార్తికేయ అందరికి పరిచయం చేశాడు. ఇక కార్తీకేయ ప్రపోజ్‌ చేసిన సన్నివేశం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu