
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య అస్వస్థతకు గురయ్యారు. షూటింగ్ లో ఉండగా ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో, వెంటనే ఆయనను హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆయన సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీ కోసం ఆయన డైట్ ప్యాక్ లో ఉన్నట్టు తెలుస్తోంది.













