HomeTelugu Big Storiesనాకు కూడా చాలా సార్లు డ్రగ్స్‌ ఆఫర్‌ చేశారు: హీరో నిఖిల్‌

నాకు కూడా చాలా సార్లు డ్రగ్స్‌ ఆఫర్‌ చేశారు: హీరో నిఖిల్‌

Hero nikhil siddharth comme

తెలంగాణలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ కేసులో.. కబాలి ప్రొడ్యూసర్ కేపీ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. కీలక సమాచారం బయటపడింది. ఆయన ఫోన్‌ డేటాతో పాటు గూగుల్ డ్రైవ్‌ డేటాను సేకరించగా.. అందులో చాలా మంది సెలెబ్రెటీలు, రాజకీయ నేతల బండారం బయటన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే.. హైదరాబాద్‌లో రాష్ట్ర మాదకద్రవ్యాల నిరోధక విభాగం పోలీసులు ఏర్పాటు చేసిన పరివర్తన కార్యక్రమంలో నటుడు ప్రియదర్శితో కలిసి నిఖిల్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిఖిల్.. తనకు కూడా చాలా సార్లు డ్రగ్స్ తీసుకొమ్మని ఆఫర్ చేశారని కీలక విషయాలు బయటపెట్టారు. అయితే.. తాను మాత్రం ఎప్పుడూ వాటి జోలికి వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు. కొందరు చేస్తున్న తప్పిదం వల్ల సినిమా ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తుందన్నారు నిఖిల్. డ్రగ్స్‌ మహమ్మారికి అందరూ దూరంగా ఉండాలని సూచించారు. నార్కోటిక్స్‌కి అలవాటు పడితే అదే డెత్ సెంటెన్స్ అని హెచ్చరించారు. స్టూడెంట్స్‌కు అందమైన జీవితం ఉందని.. ఆ లైఫ్‌ను ఎంజాయ్ చేయండని తెలిపారు. పార్టిస్‌కి వెళ్లండి ఎంజాయ్ చేయండి.. కానీ డ్రగ్స్ మాత్రం తీసుకోకండి అంటూ చెప్పుకొచ్చారు.

డ్రగ్స్ కారణంగా కొందరు నిందితులుగా మారుతున్నారు.. మరి కొందరు బాధితులుగా మిగులుతున్నారన్నారు. ఇలాంటి పరిణామాలు సమాజానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. త్వరలోనే డ్రగ్ ఫ్రీ తెలంగాణ అవ్వాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు నిఖిల్. అయితే.. నటుడు ప్రియదర్శి కూడా డ్రగ్స్ వ్యవహారంపై స్పందించారు. ఒకప్పుడు తాను కూడా సిగరెట్‌ తాగేవాడినన్నారు. సిగరెట్‌కు అడిక్ట్ కావొద్దని సంకల్పించిన వెంటనే మానేసినట్టు తెలిపారు. ఇప్పుడు తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా సంతోషంగా ఉన్నట్లు వివరించారు.

డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు ఏంటి? అవి ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి.. అనే అంశాలపై అందరికి అవగాహన రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా విద్యార్థుల కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టటం సంతోషంగా ఉందన్నారు ప్రియదర్శి. ఇదిలా ఉంటే.. టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. కేపీ చౌదరి విచారణలో సుమారు 12 మంది పేర్లు బయటపెట్టినట్టు సమాచారం అందుతోంది. ఈ పేర్లలో.. సినీ నటులతో పాటు రాజకీయ నేతలకు సంబంధించిన పేర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే ఆ పేర్లు మాత్రం ఇప్పటికీ ఇంకా బయటపడలేదు. కాగా.. కేపీ చౌదరి ఫోన్‌‌లో ఏకంగా 9 వేల నెంబర్లు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించినట్టు సమాచారం. అందులో ముఖ్యంగా.. బిగ్‌బాస్‌ ఫేం అషూ రెడ్డి, నటి సురేఖావాణి, జ్యోతి, హీరో సుశాంత్ రెడ్డి, రఘుతేజ లాంటి వాళ్ల పేర్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే.. వీళ్లలో ఎంత మందికి ఈ వ్యవహారంతో సంబంధం ఉందనేది పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu