HomeTelugu Newsడబ్బు సంపాదించడానికే సినిమాల్లోకి వచ్చాను: సోనాలి బింద్రే

డబ్బు సంపాదించడానికే సినిమాల్లోకి వచ్చాను: సోనాలి బింద్రే

13 6
టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి సరసన నటించి.. ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు నటి సోనాలిబింద్రే. ఒకానొక సమయంలో టాలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్రాల్లో నటించి బిజీ జీవితంని గడిపిన ఈ నటి తాజాగా విలేకర్లతో ముచ్చటించారు. ఇందులో భాగంగా తాను డబ్బులు సంపాదించడానికే సినిమాల్లోకి అడుగుపెట్టానని చెప్పారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విశేషాలను గురించి ముచ్చటించారు.

‘డబ్బులు సంపాదించడానికే నేను సినిమాల్లోకి వచ్చాను. సినిమాల్లోకి అడుగుపెట్టాక ఈ వృత్తి నాకెంతో నచ్చింది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా సినీ పరిశ్రమ చాలా అద్భుతమైన ప్రదేశం. ఈ పరిశ్రమలోనే కుటుంబ సభ్యులతోపాటు ఎందరో స్నేహితులను సొంతం చేసుకున్నాను. బాలీవుడ్‌కు నేనెప్పుడూ రుణపడి ఉంటాను. మధ్య తరగతి కుటుంబానికి చెందిన నేను సినీరంగంలోకి అడుగుపెట్టడం అనేది.. నాకు జరిగిన ఓ అద్భుతం. సినీరంగంలోకి అడుగుపెట్టినప్పుడు.. కొత్త లోకంలోకి వచ్చినట్లు అనిపించింది.’ అని పేర్కొన్నారు.

అనంతరం సోనాలి తనకు పుస్తకాలంటే చాలా ఇష్టమని తెలిపారు. చిన్నప్పటి నుంచి పుస్తకాలు తనకి మంచి స్నేహితులని ఆమె పేర్కొన్నారు. క్యాన్సర్‌ చికిత్స కోసం విదేశాలకు వెళ్లినప్పుడు పుస్తకాలకు మరింత దగ్గరయ్యానన్నారు. ‘చిన్నప్పటి నుంచి పుస్తకాలు నాకు మంచి స్నేహితులు. క్యాన్సర్‌ చికిత్స కోసం న్యూయార్క్‌ వెళ్లిన సమయంలో ‘ఏ జెంటిల్‌మేన్‌ ఇన్‌ మాస్కో’ అనే పుస్తకాన్ని చదివాను. ఆ పుస్తకం నాలో ధైర్యాన్ని నింపింది.’ అని సోనాలి వివరించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu