HomeTelugu Newsసిక్స్ ప్యాక్ కోసం హీరో నిఖిల్ కుస్తీ

సిక్స్ ప్యాక్ కోసం హీరో నిఖిల్ కుస్తీ

11 2
తెలుగు హీరో నిఖిల్ ‘అర్జున్ సురవరం’ మూవీతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన చందూ మొండేటి డైరెక్షన్‌లో చేస్తున్నాడు. గతంలో హిటైన ‘కార్తికేయ’ మూవీకి సీక్వెల్ ఇది. ‘కార్తికేయ 2’ పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా జరుపుకుంది.

ఈ సినిమాలో నిఖిల్ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు. అందుకోసం ఆయన గట్టిగానే కసరత్తులు చేస్తున్నాడు. తన సిక్స్ ప్యాక్ బాడీ ప్రోగ్రెస్ ను ఆయన సోషల్ మీడియా లో షేర్‌ చేశాడు. మరో 4 వారాలలో పూర్తి షేప్ ను సాధిస్తానని అన్నాడు ఈ హీరో. అందుకు సంబంధించిన ఫొటోను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. కాగా కరోనా కారణంగా పెళ్లి కూడా వాయిదా వేసుకున్నాడు ఈ హీరో.

Recent Articles English

Gallery

Recent Articles Telugu