నాగ్ వర్సెస్ సూర్య!

సింగం సిరీస్ ఓ భాగంగా రూపొందిన సింగం 3 సినిమా డిసంబర్ 16న విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాల వలన జనవరి 26కి వాయిదా వేశారు. అయితే చెన్నైలో నెలకొన్న కొన్ని పరిస్థితుల కారణంగా ఈ సినిమా రిలీజ్ డేట్ మరోసారి వాయిదా పడింది. దీంతో అందరూ ఈ సినిమా ఫిబ్రవరి 3న విడుదలవుతుందని భావించారు.

కానీ చిత్రబృందం అనూహ్యంగా సినిమా రిలేజ్ డేట్ ఫిబ్రవరి 9 అని ప్రకటించారు. ఫిబ్రవరి 10న నాగార్జున నటించిన ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమా విడుదల కానుంది. ఒక్కరోజు గ్యాప్ లో రెండు పెద్ద సినిమాలు రిలీజ్ కానుండం రొటీనే పైగా రెండు సినిమాలు.. రెండు వేర్వేరు జోనర్లు. కానీ ఈ మధ్య టాలీవుడ్ లో దీన్ని పోటీగా చూస్తున్నారు.

ప్రజలు కూడా తమ హీరో సినిమానే హిట్ కావాలని కోరుకుంటున్నారు. కంటెంట్ లో సత్తా ఉంటే గనుక ఒకే సమయంలో ఎన్ని సినిమాలు వచ్చినా.. హిట్స్ రావడం ఖాయం. మరి సూర్య, నాగార్జునల సినిమాలకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో.. చూడాలి!