HomeTelugu Trendingకార్తికేయ3 గురించి నిఖిల్ ఏమన్నాడంటే..!

కార్తికేయ3 గురించి నిఖిల్ ఏమన్నాడంటే..!

karthikeya3 update

వైవిధ్యమైన పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న హీరో నిఖిల్ ప్రస్తుతం 18 పేజెస్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. కార్తికేయ సీక్వెల్ గురించి నిఖిల్ తాజా అప్డేట్‌ను వెల్లడించారు. చిన్న సినిమాగా రిలీజైన కార్తికేయ2 ఎంతో పెద్ద విజయాన్ని సాధించింది. అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఇప్పుడు దానికి సీక్వెల్‌గా కార్తికేయ3 కూడా తప్పకుండా రూపొందించనున్నట్లు నిఖిల్ తెలిపాడు. అయితే ఈసారి త్రీడీ టెక్నాలజీతో తెరకెక్కబోతుందన్నాడు. కార్తికేయ సినిమా తన బాధ్యతను మరింత పెంచిందని అన్నాడు. త్వరలోనే కార్తికేయ3 గురించి కొన్ని విషయాలు వెల్లడిస్తానని చెప్పారు. ట్విట్టర్‌లో అభిమానుల ప్రశ్నలకు ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu