
కరోనా వైరస్ నిరోధక చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఇది రోజు వారీ కూలీలపై, కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు చిత్రం పరిశ్రమలో పని చేసే రోజు వారీ కార్మికులకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో టాలీవుడ్ ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఫండ్ కు విరాళాలు వచ్చి చేరుతున్నాయి.
తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో ప్రభాస్ తన విరాళంగా రూ.50 లక్షలు ప్రకటించాడు. కాగా ఇప్పటికే ప్రభాస్ ..పీఎం రిలీఫ్ ఫండ్ కు, రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి నాలుగు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించాడు. టాలీవుడ్ కు చెందిన మరో నటుడు బ్రహ్మాజీ కూడా సీసీసీకి రూ.75 వేలు విరాళంగా ప్రకటించాడు.













