ప్రముఖ దర్శకుడితో రామ్‌ మూవీ!

టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ హీరో రామ్.. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మాస్ లో మంచి ఫాలోయింగ్‌ తెచ్చుకున్నాడు. ఇటీవల రామ్ చేసిన ‘రెడ్’ ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. అయినా రామ్ డీలాపడిపోకుండా లింగుస్వామి డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది.

మరోపక్క, ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కి కూడా రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇటీవలే రామ్ కి మురుగదాస్ ఒక డిఫరెంట్ లైన్ వినిపించాడట. తనకి చాలా నచ్చిందని రామ్ అనడంతో, పూర్తిస్థాయి కథను మురుగదాస్ సిద్ధం చేసి తీసుకుని వచ్చాడని అంటున్నారు. ప్రస్తుతం ఆ కథపైనే చర్చలు నడుస్తున్నాయని చెబుతున్నారు.
ఇది పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రామ్.. 9 – 10 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నారట. ఎలాగూ తన సినిమాలకు తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో కూడా క్రేజ్ ఉంది కాబట్టి రామ్ దానికి తగ్గట్లే రెమ్యూనరేషన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. ఏదేమైనా యువ హీరో తన మార్కెట్ ని విస్తరించుకునే విధంగా ప్లాన్స్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.. ఇక ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది? ఇంకా ఈ ప్రాజెక్టులో ఎవరెవరు భాగం కానున్నారనేది త్వరలో తేలనుంది.

CLICK HERE!! For the aha Latest Updates