HomeTelugu Big Storiesటాలీవుడ్‌లో శ్రీకాంత్‌ కూతురు ఎంట్రీ!

టాలీవుడ్‌లో శ్రీకాంత్‌ కూతురు ఎంట్రీ!

Hero srikanth daughter toll

టాలీవుడ్‌లో ఇప్పటికే చాలా మంది వారసులు ఉన్నారు. అయితే హీరోయిన్‌లు మాత్రం తక్కువే. ప్రస్తుతం ఉన్న స్టార్‌ కిడ్స్‌లో మంచులక్ష్మీ, నిహారిక, శివాత్మిక, శివాణి ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి హీరో శ్రీకాంత్‌ కూతురు మేధ కూడా చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

17 ఏళ్ల మేధ త్వరలోనే హీరోయిన్‌గా సిల్వర్‌ స్క్రీన్‌పై మెరువబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. ప్రస్తుతం ఆమె భరత నాట్యంలో శిక్షణ తీసుకుంటుందట. ఇక కూతురు ఎంట్రీ గ్రాండ్‌గా ఉండేలా మంచి కథలను సెలక్ట్‌ చేసే పనిలో ఉన్నారట శ్రీకాంత్‌, ఊహ. ఇప్పటికే కొన్ని కథలను కూడా విన్నారట. అన్ని కుదిరితే వచ్చే ఏడాదిలో శ్రీకాంత్‌ వారసురాలిని మనం సిల్వర్‌ స్క్రీన్‌పై చూడొచ్చు అని అంటున్నారు. మరోవైపు శ్రీకాంత్‌ కొడుకు రోషన్‌ ‘నిర్మల కాన్వెంట్‌’ తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ హీరో కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ‘పెళ్లి సందD’అనే సినిమా చేస్తున్నాడు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!