ఎన్టీఆర్ సినిమాలో శ్రీదేవి..?

బాబీ దర్శకత్వంలో పని చేయడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడనే వార్త తెలియగానే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తగ్గట్లు సినిమా బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదని నిర్మాత కల్యాణ్ రామ్ తెలిపారు. శృతిహాసన్ తో పాటు మరో ఇద్దరు టాప్ హీరోయిన్స్ ను సినిమా కోసం ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే ఇప్పుడు మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. అదేమిటంటే.. ఈ సినిమాలో శ్రీదేవితో ఓ స్పెషల్ రోల్ చేయించాలనుకుంటున్నారట. ఆమెకు కథ కూడా వినిపించారని అంటున్నారు. ‘బాహుబలి’ సినిమాలో నటించమని అడిగినప్పుడే రెమ్యూనరేషన్ విషయంలో బెట్టు చేసిన శ్రీదేవి ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో నటించమని అడిగితే అంగీకరిస్తుందా..? అనే అనుమానాలు లేకపోలేవు. కానీ ఆమె గనుక ఒప్పుకుంటే సినిమా క్రేజ్ మరింత పెరిగిపోతుంది.