రోడ్డు ప్రమాదం.. క్లారిటీ ఇచ్చిన హీరో

టాలీవుడ్‌ యంగ్‌ హీరో తరుణ్‌కు తృటిలో ప్రమాదం తప్పిందని ఈరోజు ఉదయం వార్తలు వచ్చాయి. ఓటర్‌ రింగ్‌ రోడ్‌ నార్సింగ్‌ సమీపంలోని అల్కాపూర్‌ దగ్గర తరుణ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిందని, ఈ ప్రమాదంలో తరుణ్‌కు ఎలాంటి గాయాలూ కాలేదు. ప్రమాదం తరువాత వేరే కారులో వెళ్లిపోయాడని స్థానికులు చెబుతున్నారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో హీరో తరుణ్ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. తనకు ఎలాంటి యాక్సిడెంట్ కాలేదని, రాత్రి నుండి ఇంటి వద్దనే క్షేమంగానే ఉన్నానని ఆయన పేర్కొన్నారు.

టీఎస్ 09 ఈఎక్స్ 1100 నంబరుతో ఉన్న వోల్వో లగ్జరీ కారు రంగారెడ్డి జిల్లా అల్కాపురి టౌన్‌షిప్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. డివైడర్‌ను ఢీకొట్టి అదుపు తప్పిన ఈ కారులో హీరో తరుణ్ ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారని, కారును ప్రమాద స్థలంలో ఆయన వదిలిపెట్టి వెళ్లిపోయారని ప్రచారం జరిగింది. అయితే, ఆ కారు అసలు తరుణ్‌ది కాదని తేల్చారు పోలీసులు. ప్రమాదానికి గరైన కారు లీడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో రిజిస్టర్ అయ్యి ఉందని పోలీసులు తేల్చారు. యాక్సిడెంట్ సమయంలో ఓ ఇద్దరు వ్యక్తులు కారులో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. కారు ఎవరు నడిపారు అనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.