HomeTelugu Trendingషూటింగ్‌లో గాయపడ్డిన హీరో.. వీడియో వైరల్‌

షూటింగ్‌లో గాయపడ్డిన హీరో.. వీడియో వైరల్‌

Hero vishal suffers multipl

కోలీవుడ్‌ హీరో విశాల్ గాయపడ్డారు. ‘లాఠీ’ సినిమాలో భాగంగా ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా చేతికి స్వల్పంగా గాయాలయ్యాయి. బాలుడిని రక్షించే సన్నివేశం షూటింగ్‌ టైమ్‌లో ఈ ఘటన జరిగింది. చిన్నారిని పట్టుకుని కిందికి దూకే యత్నంలో చేతి ఎముకకు గాయమైనట్టు విశాల్ ట్వీట్ చేసిన వీడియోలో కనిపిస్తోంది. అందులో ఆయన పోలీస్ అధికారిగా కనిపించారు.

పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను ఎ.వినోద్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. రమణ, నంద నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో సునయన హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా, ఫైట్‌ సీన్ చిత్రీకరిస్తుండగా స్వల్పంగా గాయపడినట్టు పేర్కొన్న విశాల్.. చికిత్స, విశ్రాంతి కోసం కేరళ వెళ్తున్నట్టు తెలిపారు. మార్చి తొలి వారంలో తిరిగి తుది షెడ్యూల్‌లో పాల్గొంటానని విశాల్ పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!