HomeTelugu Trendingనడిరోడ్డు పైనే చిందేసిన హీరోయిన్‌

నడిరోడ్డు పైనే చిందేసిన హీరోయిన్‌

5 20హీరోయిన్‌ శ్రియా నడిరోడ్డు పైనే చిందేసింది. అయితే అది షూటింగ్‌లో భాగంగా కాదు.. ఇండియాలో అసలే కాదు. విదేశాల్లో. వారం క్రింతం హాలీడేస్‌ ఎంజాయ్‌ చేయడానికి ఫారిన్‌ వెళ్లిన శ్రియా అక్కడ కార్నివాల్‌ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా అందరితో కలిసి రోడ్డు మీదనే డ్యాన్స్‌ చేస్తూ ఫుల్లుగా ఎంజాయ్‌ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోలు, ఫోటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. 2001లో ఇష్టం చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రియా.. చాలా కాలం పాటు టాప్‌ హీరోయిన్‌గా వెలిగిపోయింది.

శ్రియా గతేడాది రష్యన్‌ బాయ్‌ఫ్రెండ్‌ ఆండ్రీ కొశ్చివ్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఈ భామ తమిళ్‌లో నటించిన ‘నరకాసురన్‌’ విడుదలకు రెడీ అవుతుండగా.. హిందీలో ‘తడ్కా’ అనే చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu