హీరోయిన్ ను కన్ఫర్మ్ చేసిన దేవరకొండ

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరో నుంచి నిర్మాతగా మారి కింగ్ ఆఫ్ ది హిల్ అనే ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ ప్రొడక్షన్ పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరోగా పరిచయం చేస్తూ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి సమీర్ దర్శకుడు. కాగా యాంకర్‌ అనసూయ భరద్వాజ్ ఇందులో ఓ కీలక పాత్ర చేస్తోంది.

తాజగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ ను కన్ఫర్మ్ చేసింది మూవీయూనిట్. ముంబై కు చెందిన అవంతిక మిశ్రాను హీరోయిన్ గా తీసుకున్నారు. గతంలో మాయ, మీకు మీరే మాకు మేమే వంటి సినిమాల్లో నటించింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్పీడ్ గా జరుగుతున్నాయి. ఈ సమ్మర్లోనే సినిమా ప్రారంభం కానున్నది.