
Vijay Devarakonda about Pahalgam Attack Controversy:
విజయ్ దేవరకొండ ఎప్పుడూ తన స్టైల్‌తో, మాటలతో అభిమానులను ఆకట్టుకుంటుంటాడు. కానీ ఈసారి ఆయన చేసిన కామెంట్ పెద్ద వివాదం అయ్యింది.
మే 1న తమిళ స్టార్ సూర్య సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్, “పహల్గామ్ టెర్రర్ అటాక్ అనేది పాకిస్తాన్ నుంచి వచ్చిన సెన్స్‌లెస్ మూమెంట్. ఇది 500 సంవత్సరాల కిందటి గిరిజన గుంపుల మధ్య యుద్ధాల్లా ఉంది” అని అన్నాడు.
అయితే ఈ వ్యాఖ్య గిరిజన సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకతకు గురైంది. ట్రైబల్ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు ఆయన మాటలను గిరిజనులపై అవమానకరంగా అభివర్ణించారు. వెంటనే విజయ్‌పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ చట్టంలో కేసు కూడా నమోదు అయ్యింది.
దీంతో విజయ్ దేవరకొండ స్పందిస్తూ స్పష్టత ఇచ్చాడు – “నాకు ఎలాంటి కక్ష, అవమానం చేయాలన్న ఉద్దేశం లేదు. గిరిజనులను మన దేశానికి చెందిన గొప్ప భాగంగా భావిస్తాను. నేను వాడిన ‘ట్రైబ్’ అనే పదం చారిత్రకంగా వందలేళ్ల క్రితం గల గుంపుల మధ్య యుద్ధాలకు ఉదాహరణగా మాత్రమే. ఎస్సీ/ఎస్టీ గిరిజనులని ఉద్దేశించలేదు” అని క్షమాపణ తెలిపారు.
ఇక ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగింది. అందులో 26 మంది మృతి చెందారు. ఒక స్థానిక పోనీ వాలా ధైర్యంగా ఉగ్రవాదిని ఎదుర్కొన్నప్పుడు అతనిని కూడా కాల్చారు.
ఈ దాడికి భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. వాణిజ్య సంబంధాలు, వీసాలు, సరిహద్దు వ్యవహారాలపై పాకిస్తాన్‌తో అనేక ఆంక్షలు విధించింది. దానికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ కూడా అనేక దౌత్యపరమైన చర్యలు తీసుకుంది.
ALSO READ: రెండవ రోజు HIT 3 collections ఎలా ఉన్నాయంటే